
- బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ మల్లు రవి ఫైర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దమ్ము ఏంటో చూపించామని ఎంపీ మల్లు రవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దమ్ము ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు. కేవలం 8 ఎమ్మెల్యేలే గెలిచారని గుర్తుచేశారు. ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై 8 ఎంపీ స్థానాల్లో గెలిచారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మీకు అంత దమ్ముంటే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులు, విభజన సమస్యలు గురించి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రానికి మేలు చేయాలని సంజయ్‌కి సూచించారు.