అన్నం పట్టుకున్నాడని కొట్టి చంపారు

అన్నం పట్టుకున్నాడని కొట్టి చంపారు

చంద్రమండలంపై కాలుమోపే సత్తా ఉన్న ఈ టెక్ యుగంలో మనుషులు  తోటి మనుషుల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్  భోపాల్ లో దారుణం జరిగింది. దళిత కుటుంబానికి చెందిన ఓ యువకుడు తాము తినే అన్నాన్ని చేతులతో పట్టుకున్నాడని అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు యువకులు బాధితుడ్ని కొట్టి చంపారు.

మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్ జిల్లా కృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో శుభకార్యం జరిగింది. శుభకార్యం సందర్భంగా నిర్వాహకులు  విందు భోజనం ఏర్పాటు చేశారు. శుభకార్యం అనంతరం బాధితుడు దేవరాజ్ ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న సోని, సంతోష్ లు.., దేవరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తిన్న అన్నాన్ని ఎందుకు ముట్టుకున్నావని దాడి చేశారు. ఈ దాడిలో దేవరాజ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.