
- కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్
పద్మారావునగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర లోన్లతో ఉపాధి పొందాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్‌జవదేకర్ సూచించారు. మహాజన్సంపర్క్ అభియాన్కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన బన్సీలాల్‌పేట డివిజన్ భోలక్‌పూర్ లో పర్యటించారు. ముద్ర లోన్లు తీసుకుని వెల్డింగ్‌షాపులు నడుపుతున్న లబ్ధిదారులను కలిసి మాట్లాడారు. వ్యాపారం, ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
కావాల్సిన వారు అప్లై చేసుకుంటే ముద్ర లోన్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తమకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున లోన్లు మంజూరైనట్లు లబ్ధిదారులు త్రిశూల్ గుప్తా, రమేశ్ గుప్తా, భవాని శ్రీనివాస్ చెప్పారు. ప్రకాశ్జవదేకర్వెంట మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ మహాంకాళి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ శ్యాంసుందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ టి.రాజశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు.