సంచార జాతులకు గుర్తింపు లేదు..వారి అభ్యున్నతిపై కేంద్రం ఫోకస్ పెట్టాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

సంచార జాతులకు గుర్తింపు లేదు..వారి అభ్యున్నతిపై కేంద్రం ఫోకస్ పెట్టాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: సమాజంలో నేటికీ కొన్ని సంచార జాతుల కులాలు గుర్తింపునకు నోచుకోలేదని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. వారిని గుర్తించి సరైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై కేంద్రం ఫోకస్ పెట్టాలని కోరారు. బుధవారం ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో తెలంగాణ ఓబీసీ సాధన సమితి ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది. ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్యతోపాటు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్,  మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... తెలంగాణలో బీసీలుగా గుర్తింపు పొందిన 28 సంచార జాతి కులాలు జాతీయస్థాయిలో నేటికీ ఓబీసీగా గుర్తింపు పొందలేదన్నారు. అందువల్ల ఆయా కులాల వారి పిల్లలు ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంచార అట్టడుగు కులాలపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.