పాలన చేతగాకపోతే ఎన్నికలకు వెళ్లండి : ఎంపీ రఘునందన్ రావు

పాలన చేతగాకపోతే ఎన్నికలకు వెళ్లండి : ఎంపీ రఘునందన్ రావు
  • అసెంబ్లీని రద్దు చేసుకోండి: ఎంపీ రఘునందన్ రావు
  • ఎలక్షన్ హామీలు అమలు చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: రేవంత్‌‌‌‌ రెడ్డి అంత అసమర్థ సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని ఎంపీ రఘునందన్‌‌‌‌ రావు విమర్శించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చేసిన కామెంట్లను రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. పాలన చేతగాకపోతే ఎన్నికలకు వెళ్తారో.. అసెంబ్లీని రద్దు చేస్తారో.. రేవంత్‌‌‌‌ రెడ్డి నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్‌‌‌‌ గాంధీని ఎన్నికల ముందు తెలంగాణకు తీసుకొచ్చి ఏం ప్రకటించాడో రేవంత్‌‌‌‌ రెడ్డికి తెలియదా? కేసీఆర్‌‌‌‌ లక్షల కోట్ల అప్పులు చేశాడంటూ ఎలక్షన్స్ కు ముందు ప్రచారంలో రాహుల్‌‌‌‌ గాంధీతో రేవంత్‌‌‌‌ రెడ్డి చెప్పారు.

 కేసీఆర్‌‌‌‌ కుటుంబం నుంచి లక్ష కోట్లు- కక్కించి స్కీంలు అమలు చేయిస్తా అని మాట ఇచ్చింది మరిచారా? ఏడాదిన్నర పాలనలో కేసీఆర్‌‌‌‌ కుటుంబం నుంచి ఒక్క పైసా అయినా వసూలు చేశారా? ఒక్కరినైనా అరెస్టు చేయించారా? పాలన చేతగాక రేవంత్‌‌‌‌ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నరు. అధికారంలోకి వచ్చాక రేవంత్‌‌‌‌ రెడ్డి రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేశారు’’అని రఘునందన్ రావు అన్నారు. ఉగ్రదాడి గురించి మోదీకి ముందే తెలుసని మల్లికార్జున ఖర్గే అనడం దౌర్భాగ్యం అన్నారు. 

67% కోటా కొనసాగించండి

తెలంగాణలో 3 సైనిక్‌‌‌‌ స్కూళ్లను ఏర్పాటు- చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌‌‌‌ సేథ్‌‌‌‌ ను కలిసి కోరినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సైనిక పాఠశాలలు ప్రారంభం అయ్యే వరకు ఏపీలో సైనిక్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ లో 67 % లోకల్‌‌‌‌ కోటా ఉంచాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఏపీ సైనిక్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌లో ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థుల కోటాను కొనసాగించాలన్నారు.