- పొత్తులు పెట్టుకుంటూ ఉనికిని కాపాడుకుంటున్న కమ్యూనిస్టులు
- భద్రాద్రి కొత్తగూడెంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్థానిక ఎన్నికలు వచ్చే డిసెంబర్, జనవరిల్లో జరిగే చాన్స్ ఉందని బీజేపీ నేత, మెదక్ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, మున్సిపల్‌కు జరిగే చాన్స్ ఉన్నందున పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని క్లబ్లో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు ప్రోగ్రాంలో ఆయన పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. చెరువుల ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు.
చెరువుల్లో ఆక్రమణలు తొలగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. నష్టపోయే పేద, మధ్యతరగతి ప్రజలకు కోకాపేటలో ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా రేవంత్సర్కార్ చర్యలు తీసుకోవాలన్నారు. పేదల కోసం పోరాడుతున్నామని చెప్పే సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు కోకాపేటలో గుడిసెలు ఎందుకు వేయించడం లేదని ప్రశ్నించారు. పొత్తు పెట్టుకుంటూ కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకుంటున్నాయని విమర్శించారు. గత పదేండ్లలో అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిథ్యం లేదన్నారు.