సంగారెడ్డి టౌన్, వెలుగు: వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఆదివారం సంగారెడ్డిలోని ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో వాసవీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాసవి క్లబ్ సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వాసవీ క్లబ్ సభ్యులు సూర్య ప్రకాశ్ రావు, రామారావు, ప్రకాశ్, శ్రీధర్, శ్రీనివాసరావు, విజయేంద్ర రెడ్డి, శ్రీనివాస్, నరసింహులు, ఉపేందర్, రాధా కిషన్, బుచ్చిలింగం, విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో టెట్ అంశంపై చర్చించి సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్మినహాయింపు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వాళ్లలో సాయి తేజ, అనురాధ, విశాలాక్షి ఉన్నారు.
