ఆ రెండు పార్టీల ఆత్మ ఒక్కటే.. శరీరాలే వేరు

ఆ రెండు పార్టీల ఆత్మ ఒక్కటే..  శరీరాలే  వేరు

టీఆర్ఎస్, బీజేపీది ఆత్మ ఒక్కటే శరీరాలు మాత్రమే వేరన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ చేస్తారని... ఏడేళ్లుగా చేస్తున్నది ఇదే అంటూ విమర్శిస్తూ కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఢిల్లీపై యుద్ధమని.. కేసీఆర్ మోడీతో రాజీ పడ్డారని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బీజేపీపై యుద్ధం అంటున్నారని.. ఉత్తర కుమారుడిలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీటీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే విభజన చట్టంలో హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ నిరవదిక నిరహార దీక్షకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ నెల 8న పార్లమెంట్ మలి విడత సమావేశమవుతోందని..దీక్షతో మోడీపై ఒత్తిడి పెంచుదాం రాండి అంటూ సవాల్ చేశారు రేవంత్. తన సవాల్ కు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని.. దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తన సవాల్ ను స్వీకరించకుంటే..మోడీ తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా శాశ్వతంగా మిగిలిపోతారన్నారు రేవంత్.