కేసీఆర్.. రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా? 

కేసీఆర్.. రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా? 

రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా? అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా సాయంపల్లిలో ఈ రోజు రైతు రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పూనుకుంది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. అయితే రచ్చబండ కార్యక్రమానికి అనుమతిలేదని పోలీసులు.. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అటు జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. పోలీసుల తీరు పట్ల రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.

‘రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా!? మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్… ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు… కానీ, పేదరైతు కుటుంబాన్ని మేం పరామర్శిస్తుంటే తప్పా?’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

For More News..

మాస్క్ సరిగాపెట్టుకో.. వృద్ధుడిపై యువతి దాడి