ఫార్మా సిటీ పేరుతో రైతుల పొలాలను దోచుకుంటున్నరు

ఫార్మా సిటీ పేరుతో రైతుల పొలాలను దోచుకుంటున్నరు

రంగారెడ్డి: ఫార్మా సిటీ పేరుతో పచ్చని పొలాలను కాలుష్యం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎంపి రేవంత్ రెడ్డి. రాజీవ్ రైతు భరోసా యాత్ర 9 వ‌ రోజు లో భాగంగా రేవంత్.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం లోని దెబ్బడగూడ, కందుకూరు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. పాదయాత్ర లో పొలాల్లోకి వెళ్లి టమాటా, కొత్తిమీర, పలు పంట పొలాలను ఎమ్మెల్యే సీతక్క తో పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చే విధంగా నూతన వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి, ప్రధాని మోడీ కాళ్ళమీద పడి నూతన వ్యవసాయ బిల్లులకు తాను కూడా మద్దతు తెలుపుతున్నాను అని చెప్ప‌డం సిగ్గుచేటన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హయంలోనే అభివృధి జరిగిందన్నారు. ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమాశ్రయం, ఫ్యాభ్ సిటీ, కంపెనీలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కూడా కాంగ్రెస్ హ‌యాంలోనే జరిగింద‌ని పేర్కొన్నారు.

ఫార్మా సిటీ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పొలాలను దోచుకుంటుంద‌ని, ఫార్మా సిటీలో భూమిని ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా దోచుకుంటున్నదని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం లో చేసిందేమీ లేద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టమాటా రైతుల కోసం సాస్ కంపెనీ ఏర్పాటు చేస్తానని చెప్పారు రేవంత్. రాజీవ్ రైతు భరోసా యాత్రలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, సీనియర్ నాయకులు దెప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.