మొదటి కృష్ణుడు కేసీఆర్..రెండో కృష్ణుడు కేటీఆర్: ఎంపీ రేవంత్ రెడ్డి

మొదటి కృష్ణుడు కేసీఆర్..రెండో కృష్ణుడు కేటీఆర్: ఎంపీ రేవంత్ రెడ్డి

మొదటి కృష్ణుడు సీఎం కేసీఆర్, రెండో కృష్ణుడు మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మున్సిపల్ శాఖకు ఒక్కరూపాయి కేటాయించలేదు

ట్యాంక్ బండ్ లో ఉన్న నీళ్లను కొబ్బరినీళ్లలెక్క తాగేట్లు చేస్తామని, ట్యాంక్ బండ్ పక్కనే 100 అంతస్తుల సముదాయాన్ని నిర్మించి, అందులో పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తామని, హైదరాబాద్ లో ట్రాఫిక్ శాస్వత పరిష్కార మార్గంగా ప్లైఓవర్లు నిర్మించి ప్రపంచంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో నిలబెడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. కానీ మున్సిపల్ శాఖకు ఒక్కరూపాయి కేటాయించలేదన్నారు.  వరంగల్ లో డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తా..కోడి కూర, కల్లు లంచమివ్వాలని నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. మరి ఆ డుబుల్ బెడ్రూంల నిర్మాణం ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు.

మొదటి కృష్ణుడు కేసీఆర్ ఆలా రెండో కృష్ణుడు కేటీఆర్ ఇలా  

మొదటి కృష్ణుడు ఆ మాటలు చెబితే రెండో కృష్ణుడైన కేటీఆర్ తన సమర్ధవంతమైన పరిపాలన చూసి ఓట్లేయాలని అడుగుతున్నారని చెప్పారు. కేటీఆర్ సమర్ధత ఎలాంటిదో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ పావనినీ అడిగితే తెలుస్తుందన్నారు. మున్సుపాలిటీలో పనులకు 3శాతం కమీషన్ తీసుకోమన్నారని కేటీఆర్ తమకు చెప్పినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ చెప్పారాంటే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పనితీరు ఎలా ఉందో చూడాలని అన్నారు. పట్టణప్రాంతాల్లో రెండు లక్షల డబుల్ బెడ్రూంలు, మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి నల్ల, 57ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చిందో చెప్పాలన్నారు.

అందుకే మున్సిపల్ ఎన్నికలకి మొదటి కృష్ణుడికి మొహం చెల్లక, రెండో కృష్ణుడ్ని తెరమీదకు తెచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొదటి కృష్ణుడైన, రెండో కృష్ణుడైన సీసా మాత్రమే కొత్తది…అందులో సారా మాత్రం పాతదేనన్నారు. పాత సారాను కొత్తసీసాలో పోసి ప్రజల్ని మభ్యపెట్టి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నయానోభయానో భయపెట్టో, బెదిరించో గెలిచామని ప్రజలకు చెప్పేందుకు కేసీఆర్, కేటీఆర్ లు ఒకరు తెరముందు, ఇంకొకరు తెర వెనుక నాటకమాడుతున్నారని విమర్శించారు.

బయోడైవర్సిటీని మైహోం అధినేత రామేశ్వరావు కు అనుగుణంగా నిర్మించారు

మైహోం అధినేత రామేశ్వరావు నిర్మించిన మై హోం భుజ ఎదుట బయోడైవర్సిటీ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బయోడైవర్సిటీని మైహోం బంధువులకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లు నిర్మించారని, అందుకే కారు ప్రమాదం జరిగిందన్నారు. స్వప్రయోజనం కోసమే బయోడైవర్సిటీని నిర్మించినట్లు సాంకేతిక నిపుణులు చెప్పారు కాబట్టే ఫ్లైఓర్ ను మూసివేసి..మళ్లీ రీఓపెన్ చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.