నేను రెడీ.. ఈఎస్‌ఐ స్కాంలో లై డిటెక్టర్‌ టెస్ట్‌కు కేసీఆర్ సిద్ధమా?

నేను రెడీ.. ఈఎస్‌ఐ స్కాంలో లై డిటెక్టర్‌ టెస్ట్‌కు కేసీఆర్ సిద్ధమా?

హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ ఇష్యూపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మంత్రి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాను విసిరిన వైట్ ఛాలెంజ్‌‌ను స్వీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ రేవంత్ ట్వీట్ చేశారు. తామిద్దరం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గర కేటీఆర్ కోసం వేచి చూస్తామన్నారు. రేవంత్ ట్వీట్‌‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఏ టెస్ట్ కు అయినా రెడీ అన్నారు. చర్లపల్లి జైళ్లో ఉన్న వ్యక్తితో  టెస్ట్ కోసం వెళ్తే తన గౌరవానికి భంగం కలుగుతుందన్నారు కేటీఆర్. అందుకే రాహుల్ గాంధీ వస్తే తాను ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్ చేయించుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్. తాను టెస్ట్ చేసుకొని, క్లీన్ చీట్ తెచ్చుకుంటే రేవంత్ క్షమాపణ చెప్పడంతో పాటు పదవి నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. అలాగే ఓటుకు నోటుపై లై డిటెక్టర్ టెస్ట్‌కు రేవంత్ రెడీనా అని ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. మరోవైపు మంత్రి కేటీఆర్ సవాల్ పై రేవంత్ రెడ్డి మళ్లీ టిట్టర్ లో స్పందించారు. 

సహారా PF, ESI హాస్పిటల్ కుంభకోణాలపై కేసీఆర్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని కేటీఆర్‌‌ను రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. ‘కేటీఆర్.. టైమ్, ప్లేస్ చెప్పండి. సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ హాస్పిటల్ కుంభకోణాల మీద లై డిటెక్టర్‌ టెస్టుకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమా?’ అని అని రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ప్రశ్నించారు.