కృష్ణా బోర్డు ఛైర్మన్ గా ఎంపీ సింగ్ నియామకం

V6 Velugu Posted on Jun 11, 2021

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌గా ఎంపీ సింగ్‌ ను  నియమిస్తూ కేంద్ జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత వరకు పనిచేస్తున్న ఎం.పరమేశం స్థానంలో ఎంపీ సింగ్ ను నియమించింది. ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖా మంత్రిని ఏపీ సీఎం జగన్ ను కలసి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ నియామకం జరగడం గమనార్హం. 
కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ గా నియమితులైన ఎంపీ సింగ్ సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ (HAG)గా ప్రమోట్‌ చేసి ఈనెల 1వ తేదీ నుంచి ఆయనకు కొత్త స్కేల్‌పై జీతాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయన పదవీలో చేరిననాటి నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.
 

Tagged Krishna River, , KRMB chairman, krishna board chairman MP singh, Krishna river board Chairman, centre jal sakthi bhavan, krsihna water issues

Latest Videos

Subscribe Now

More News