సింగరేణి కార్మికుడు లక్ష్మణ్ మృతి చెందడం బాధాకరమని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ అన్నారు.
ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉండి అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. కార్మికుడి మృతిని గని ప్రమాదంగా పరిగణించాలన్నారు.