
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సోమవారం ‘షో రీల్’ పేరుతో ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు రివీల్ చేశారు.
కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో జగపతిబాబు విలన్‌గా నటిస్తుండగా, భాగ్యశ్రీ బోర్స్ రవితేజకి జంటగా కనిపించింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కాన్సెప్ట్‌ను తెలియజేస్తూ సాగిన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. టీజర్ చివర్లో అమితాబ్ ఫ్యాన్‌గా కనిపించాడు రవితేజ. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.