సూపర్ స్పీడ్‌‌‌‌తో మిస్టర్ బచ్చన్

సూపర్ స్పీడ్‌‌‌‌తో మిస్టర్ బచ్చన్

 రీసెంట్‌‌‌‌గా ‘ఈగల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. మరోవైపు తన కొత్త చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌’ షూటింగ్‌‌‌‌తో బిజీగా ఉన్నారు.  హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తికాగా, తాజాగా మరో కీలక షెడ్యూల్‌‌‌‌ను కూడా కంప్లీట్ చేసినట్టు హరీష్ శంకర్ తెలియజేశాడు. ‘‘మిస్టర్ బచ్చన్’ మరో అందమైన షెడ్యూల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా కంప్లీట్ అయ్యింది. ఇంత వేగంగా చేయడానికి సపోర్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్‌‌‌‌కు థ్యాంక్స్ అనే మాట చెప్పలేను. 

అలాగే 24 గంటలూ పనిచేసినందుకు మాస్ మహారాజ్‌‌‌‌కు మిలియన్ థ్యాంక్స్’ అంటూ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఈ సందర్భంగా సెట్‌‌‌‌లో టీమ్ అంతా కలిసున్న ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో రవితేజకు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. పనోరమా స్టూడియోస్,  టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.