Mr. కింగ్ మూవీ రివ్యూ

Mr. కింగ్ మూవీ రివ్యూ

అన్విక క్రియేషన్స్ బ్యానర్ పై శరన్ కుమార్, యశ్వీకా ఊర్వి లీడ్ రోల్ లో నటించిన సినిమా మిస్టర్ కింగ్. అలనాటి నటి విజయ నిర్మల మనవడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయిన ఈ సినిమా... వారిని థియేటర్లకి రప్పించగల్గిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వస్తున్నాడంటే అభిమానుల్లో ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉంటాయి. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లని చూశాక అభిమానులకి షాక్ తగిలిందనే చెప్పొచ్చు. పోనీ అభిమానం కొద్ది ధైర్యం చేసి సినిమా చూద్దామని థియేటర్ కి వచ్చిన వాళ్ల పరిస్థితీ నరకమే.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ శివ.. ఆర్జేగా పనిచేస్తుంటాడు. మెరిట్ స్టూడింట్ అయిన శివ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే మనిషి. తోటివారికి మంచి చేస్తూ... ఏదో సాధించాలన తపనతో ఉంటాడు. ప్రాజెక్ట్ వాయు పేరుతో ఫ్యూయల్ లేకుండా విమానాన్ని నడిపేలా సరికొత్త టెక్నాలజీని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే అనకోకుండా తన లైఫ్ లోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. ఇద్దరమ్మాయలు ఎవరు? తాను అనుకున్నది సాధించాడా? శివకి ఎలాంటి స్ట్రగుల్స్ ఎదరయ్యాయన్నదే ఈ సినిమా కథ.

ఈ మూవీకి కథని అందిస్తూ దర్శకత్వం వహించిన డైరెక్టర్ శశిధర్ కి కూడా ఇది ఫస్ట్ మూవీనే. తన స్టోరీ లైన్ బాగున్నప్పటికీ... అనుకున్నది అనుకున్నట్లు చూపించలేకపోయాడు. స్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా  ఒక సీన్ బాగుందని చెప్పే పరిస్థితీ లేదు. మంచి స్టోరీ ఉన్నా  ఎందుకు పక్కదారి పట్టించాడో డైరెక్టర్ కే తెలియాలి.

ఇక ఈ సినిమాలో హీరోగా శరన్ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ఎమోషనల్ సీన్స్ ని పండించలేకపోయిన ఈ హీరో.... డైలాగ్స్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. తన యాక్టింగ్ స్కిల్స్ ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇక హీరోయిన్స్ గా చేసిన యశ్విక, ఊర్వి సింగ్ లు పర్వాలేదనించారు. హీరో ఫ్రెండ్ గా చేసిన రోషన్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్బ్. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ లాంటి సీనియర్ నటులున్నా... వారిని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఈ సినిమాలో ఉన్న రెండు పాటలతో పాటు మణిశర్మ మ్యూజిక్ బాగుంది. 

ఆకాశమే హద్దురా వంటి సూపర్ హిట్ లైన్ ఉన్న ఈ సినిమాని పూర్తిగా పక్కిదారి పట్టించేశారు. అసలు లైన్ పక్కన పెట్టి రెండున్నర గంటల లవ్ ట్రాక్ ని ఎందుకు నడిపించాడో డైరెక్టర్ కే తెలియాలి. ఇక ఈ సినిమాని ఒక్కసారి కూడా పూర్తిగా చూడలేము. ధైర్యం చేసి థియేటర్ కి వెళ్లినా... జనాలు పది నిమిషాలకే బయటికొచ్చేస్తారు. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేసేముందు కాస్తా జాగ్రత్త పడుంటే బాగుండేదేమో.