
బొంత రాము హీరోగా అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘మిస్టర్ రాము’. అజయ్ కౌండిన్య దర్శకత్వంలో బొంత రాము నిర్మించాడు. షూటింగ్ పూర్తిచేసుకుని, రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందర్నీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని రాము అన్నారు.
ఇందులో నటించడం హ్యాపీ అన్నారు హీరోయిన్స్ అవంతిక, సంధ్య. హాస్పిటల్స్‌లో చిన్నపిల్లల కిడ్నాప్స్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, మెసేజ్ ఇస్తూనే, ఎంటర్‌టైన్ చేస్తుందని దర్శకుడు అజయ్ కౌండిన్య అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.