
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా మృణాళ్ శ్రేష్ఠను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 2023 ఐఏఎస్బ్యాచ్ బిహార్ క్యాడర్ కు చెందిన మృణాళ్ శ్రేష్ఠ 2024 ఏప్రిల్ 15వ తేదీన తెలంగాణకు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో కొంత కాలం ట్రైనీ ఐఏఎస్‌గా పనిచేశారు. ట్రైనింగ్ అనంతరం ఇప్పుడు భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. కాగా భద్రాచలం ఆర్డీవోగా 2024 మార్చి 4వ తేదీన బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌రావును బదిలీ చేశారు. ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ఇవ్వలేదు.