
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఇందులో ఓ వైపు సీతగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఈ సినిమాలో ఎంత పద్దతిగా కనిపించిందో.. అందుకు పూర్తి భిన్నంగా ‘లస్ట్ స్టోరీస్ 2’లో కనిపించింది మృణాల్ ఠాకూర్. ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించిందామె. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఇప్పుడిక కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. శివకార్తికేయన్‌కి జంటగా ఓ చిత్రంలో నటించబోతోందట మృణాల్ ఠాకూర్.
ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్ పాత్రకు మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించిన టీమ్.. ఈ మూవీకి ఆమె పర్ఫెక్ట్ యాప్ట్ అని భావిస్తున్నారట. షూటింగ్‌కు ముందు ఓ ఫొటో షూట్ చేసి, మృణాల్‌నే ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలుగులో నానికి జంటగా ఓ చిత్రంలో నటిస్తున్న మృణాల్.. విజయ్ దేవరకొండతోనూ ఓ చిత్రంలో నటిస్తోంది.