తెలుగబ్బాయితో మృణాల్ పెళ్లి.. నాకు కూడా చెప్పారా ప్లీజ్!

తెలుగబ్బాయితో మృణాల్ పెళ్లి.. నాకు కూడా చెప్పారా ప్లీజ్!

సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) పెళ్లి ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పెళ్లి గురించే ప్రస్తావన. మృణాల్ ఠాకూర్ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని, ఆ అబ్బాయి ఎవరు? అంటూ నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. ఈ వార్తలు మృణాల్ వరకు చేరడంతో రీసెంట్ గా ఆమె స్పందించారు. 

ఆమె హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi nanna). నాని(Nani) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులోల్ భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరోయిన్ మృణాల్. 

Also Read :- పెళ్లి తరువాత మొదటిసారి హైదరాబాద్లో అడుగుపెట్టిన నవ దంపతులు

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మృణాల్ పెళ్లి గురించి ప్రశ్నించారు. ఇంతకీ ఆ తెలుగబ్బాయి ఎవరూ? అంటూ  డైరెక్ట్ గా అడిగేశాడు. దానికి సమాధానంగా మృణాల్ మాట్లాడుతూ.. తెలుగబ్బాయితో పెళ్లిపై నా కుటుంబసభ్యులు, మిత్రులు, డిజైనర్లు, స్టైలిస్ట్‌లు పదే పదే అడుగుతున్నారు. నేను అదే అడుగుతున్నా.. ఇంతకీ ఆ తెలుగబ్బాయి ఎవరు? తెలిస్తే నాకు కూడా చెప్పండి. నిజానికి ఆ వార్తలు చూసి నేను చాలా నవ్వు కున్నా. . అని చెప్పుకొచ్చారు. దీంతో మృణాల్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లియర్ అయ్యింది.