పెళ్లి తరువాత మొదటిసారి హైదరాబాద్లో అడుగుపెట్టిన నవ దంపతులు వరుణ్-లావణ్య

పెళ్లి తరువాత మొదటిసారి హైదరాబాద్లో అడుగుపెట్టిన నవ దంపతులు వరుణ్-లావణ్య

టాలీవుడ్ నవదంపతులు వరుణ్ తేజ్(Varun tej), లావణ్య(Lavanya tripathi) హైదరాబాద్ లో అడుగుపెట్టారు. నవంబర్ 1న వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరగగా.. నేడు(నవంబర్ 4) హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో కొత్త జంటను కవర్ చేసేందుకు మీడియా ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంది. లావణ్య, వరుణ్ లను కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read :- ఈ అందాల రాక్షసి ముందే చెప్పింది

ఇక నవంబర్ 5 ఆదివారం రోజున వీరి రిసెప్షన్ భారీ ఎత్తున జరుగనుంది. దీనికి సంబందించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. ఇక  పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవగా.. రెసెప్షన్ కు మాత్రం పెద్ద సంఖ్యలు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు హాజరుకానున్నారట.