జీ5లో పూజా మేరీ జాన్ 

జీ5లో పూజా మేరీ జాన్ 

ప్రేమ, తిరస్కరణ, వ్యామోహం, బాధ్యత, న్యాయం వంటి అంశాల చుట్టూ సాగే ఇంటెన్స్ డ్రామా  ‘పూజా మేరీ జాన్’.  నవ్‌‌జోత్ గులాటి దర్శకత్వంలో దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రం థియేటర్స్‌‌లో కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జీ5లో ప్రీమియర్ కానుంది. గురువారం ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  మృణాల్ ఠాకూర్ టైటిల్ పాత్రలో నటించగా, హుమా ఖురేషి న్యాయవాది సనా పాత్రలో కనిపించనుంది. 

స్నేహితుడు ప్రేమించానని ప్రపోజ్ చేయడంతో, పూజ తిరస్కరిస్తుంది. దాంతో అతడు సూసైడ్ చేసుకుంటాడు. ఆత్మహత్యకు ప్రేరేపించింది అనే కారణంతో ఆమెను అరెస్ట్ చేస్తారు.  తర్వాత జరిగే పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుంది. 

ట్రైలర్‌‌‌‌ రిలీజ్ సందర్భంగా  పూజ పాత్ర తనకు ఛాలెంజింగ్‌‌గా అనిపించిందని మృణాల్ ఠాకూర్ చెప్పగా, విభిన్న కోణాల్లో ఒకే ఘటనను చూపించడం తనను ఆకట్టుకుందని హుమా ఖురేషి చెప్పింది.  ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలో భాగం కావడం ఆసక్తికరమైన అనుభవమని విక్రమ్ సింఘాల్ చౌహాన్ అన్నాడు.