IPL: ధోనీని మించిన సారథి లేడు.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ IPL టీమ్ ఇదే

IPL: ధోనీని మించిన సారథి లేడు.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ IPL టీమ్ ఇదే

భారత క్యాష్ రిచ్ లీగ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) పురుడుపోసుకొని రేపటి(ఫిబ్రవరి 20)తో 16 ఏళ్ళు పూర్తి కానున్నాయి. ఈ సంధర్బంగా లీగ్ తొలి సీజ‌న్ మొద‌లు ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లు ఎవరనే దానిపై కొంద‌రు క్రికెట్ దిగ్గజాలు కలిసి 'ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్‌'ను ప్రక‌టించారు. ఈ జట్టు సారథిగా ధోనీ ఎంపికవ్వగా.. ఏకంగా 9 మంది భార‌త క్రికెట‌ర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.     

సారథిగా ధోనీకే ఓటు

టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వ‌సీం అక్రమ్‌, డేల్ స్టెయిన్‌తో కూడిన సెలక్షన్‌ ప్యానల్‌.. 70 మంది పాత్రికేయులతో కలిసి ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టును ఎంపిక చేసింది. సారథిగా అందరూ ధోనికే ఓటేశారు. ఐపీఎల్‌ టోర్నీ మొత్తంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ధోనీ నడిపించిన తీరు అద్భుతమని సెలక్షన్‌ కమిటీ కొనియాడింది. జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉన్నా.. లేకపోయినా.. టైటిళ్లు అందించిన ఘనత ధోనీదే అని కితాబిచ్చారు.

9 మంది భార‌త క్రికెట‌ర్లు

ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్‌ జట్టులో ఏకంగా 9 మంది భార‌త క్రికెట‌ర్లు చోటు దక్కించుకున్నారు. ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజా, య‌జ్వేంద్ర చాహ‌ల్‌, హార్దిక్ పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రాలతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియ‌ర్స్, ల‌సిత్ మ‌లింగ‌, ర‌షీద్ ఖాన్ లు తుది జ‌ట్టులో చోటు సంపాదించారు.

ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు: విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, ర‌వీంద్ర జ‌డేజా, య‌జ్వేంద్ర చాహ‌ల్‌, హార్దిక్ పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రాలతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియ‌ర్స్, ర‌షీద్ ఖాన్, ల‌సిత్ మ‌లింగ‌.

ఇంప్యాక్ట్ ప్లేయర్స్: రోహిత్ శర్మ, సూర్య‌కుమార్ యాద‌వ్, సునీల్ న‌రైన్, డ్వేన్ బ్రావో
కోచ్‌: స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్).