IPL 2026: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోనీ.. మహేంద్రుడు గ్రౌండ్‌లో లేకపోతే విజయం ఎలా..?

IPL 2026: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోనీ.. మహేంద్రుడు గ్రౌండ్‌లో లేకపోతే విజయం ఎలా..?

ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తమ తమ ఫ్రాంచైజీలకు దశాబ్దానికి పైగా ఆడి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న సంజు శాంసన్, రవీంద్ర జడేజా స్వాప్ అయ్యారు. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి  రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోనుంది. శాంసన్ చెన్నై జట్టులోకి వస్తే ట్రేడింగ్ ద్వారా వారు జడేజాతో పాటు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను చెన్నై వదిలేసుకుంది. సూపర్ కింగ్స్ జట్టులోకి శాంసన్ రావడం గుడ్ న్యూస్ అయినా చిన్న కన్ఫ్యూజన్ లో పడినట్టు తెలుస్తోంది. 

సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు రావడంతో ఆ జట్టు భవిష్యత్ సేఫ్ గా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. శాంసన్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే లాంటి టీమిండియా ప్లేయర్స్ ఆ జట్టు సొంతం. యంగ్ సంచలనం డెవల్డ్ బ్రేవీస్, మాత్రేలతో చెన్నై జట్టు ఫ్యూచర్ లో కూడా పటిష్టంగా ఉండడం ఖాయం. శాంసన్ రాకతో ధోనీ టెస్ట్ తీసుకోనున్నాడు. వికెట్ కీపర్ గా ధోనీ స్థానంలో శాంసన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నాడు. దీని ప్రకారం ధోనీ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగనున్నట్టు టాక్ నడుస్తుంది. ఒకవేళ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగితే గ్రౌండ్ లో చెన్నై ధోనీ అనుభవాన్ని కోల్పోవాల్సి వస్తుంది. 

►ALSO READ | Team India: సొంతగడ్డపై చివరి 6 టెస్టుల్లో 4 ఓటములు.. తొలి టెస్టులో టీమిండియా ఓటములకు 4 కారణాలు ఇవే!

గ్రౌండ్ లో ధోనీ ఉంటే ఆ భరోసానే వేరు. ఫీల్డింగ్, బౌలింగ్ ప్రణాళికలతో మ్యాచ్ స్వరూపాన్నే మారుస్తాడు. దాదాపు రెండు దశాబ్దాలు క్రికెట్ లో అనుభవం ఉన్న మహేంద్రుడు మాస్టర్ మైండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒత్తిడి సమయంలో జట్టును ప్రశాంతంగా ముందుకు నడిపిస్తాడు. ధోనీ వికెట్ కీపింగ్ లో చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్ లో బ్యాకప్ వికెట్ కీపర్ ఎవరూ లేకపోవడంతో జట్టు కోసం గాయంతోనే వికెట్ కీపింగ్ చేశాడు. ఈ కారణంగానే జడేజాను రిస్క్ చేసి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని కీపింగ్ కోసం శాంసన్ ను తీసుకొచ్చారు. 

ధోనీ వయసు 43 సంవత్సరాలు కావడంతో వికెట్ కీపింగ్ షార్ప్ గా చేయడం కొంచెం కష్టమే. దీంతో ధోనీ కేవలం బ్యాటింగ్ మాత్రమే ఆడనున్నట్టు అర్ధమవుతోంది. గైక్వాడ్, శాంసన్ లాంటి యంగ్ టాలెంటెన్డ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ధోనీ సేవలు అందుబాటులో లేకపోవడం చెన్నై ఫ్యాన్స్ కు విచారానికి గురి చేసేదే. గైక్వాడ్ కెప్టెన్ గా.. శాంసన్ వైస్ కెప్టెన్ చెన్నై జట్టు బాగుంది. కానీ ఫీల్డ్ లో చెన్నై  ధోనీ సలహాలను కోల్పోవడం ప్రతికూలంగా మారనుంది.