నవంబర్ తర్వాతే అందుబాటులోకి..
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్ నుంచి విరామం తీసుకున్న మాజీ సారథి ఎంఎస్ ధోనీ.. ఇప్పట్లో బ్యాట్ పట్టేలా కనిపించడం లేదు. నవంబర్ చివరి వరకు మహీ టీమిండియా సెలెక్షన్‌కు అందుబాటులో ఉండటం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్మీలో పని చేసేందుకు వీలుగా వెస్టిండీస్ టూర్, సౌతాఫ్రికాతో టీ20లకు దూరమైన ధోనీ.. బ్రేక్‌ను మరికొంత కాలం పొడిగించుకోవాలని చూస్తున్నాడు. ఇదే జరిగితే ఈ నెల 24 నుంచి జరిగే విజయ్ హజారే టోర్నీ, నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో మొదలయ్యే టీ20 సిరీస్‌కు కూడా మహీ అందుబాటులో ఉండడు. అంటే మరో రెండు నెలల పాటు ధోనీ ఆటను అభిమానులు చూడలేరు. ఇక డిసెంబర్‌లో వెస్టిండీస్.. ఇండియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ధోనీ భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలు మొదలైన నేపథ్యంలో ఈ సిరీస్‌కూ అవకాశం ఇస్తారా? లేదా? అన్నది కూడా సందేహంగా మారింది.

