IPL 2024: ధోనీని చూడడానికి రూ. 64 వేలు.. పిల్లల స్కూల్ ఫీజ్ పట్టించుకోని తండ్రి

IPL 2024: ధోనీని చూడడానికి రూ. 64 వేలు.. పిల్లల స్కూల్ ఫీజ్ పట్టించుకోని తండ్రి

టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వీరిలో కొంతమంది మాహీకి భక్తులు కూడా ఉంటారు. డై హార్డ్ ఫ్యాన్స్ అనే మాట మనం విన్నాం కానీ ఒక వ్యక్తి మాత్రం అది ప్రత్యక్షంగా చూపించాడు. కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ఉన్న డబ్బులతో ధోనీని చూడడానికి స్టేడియం కి వెళ్లి తన వీరాభిమానం చాటుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఏప్రిల్ 8 న మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చింది. సొంతగడ్డపై ధోనీని చూడడానికి ఎప్పటిలాగే అభిమానులు భారీగా వచ్చారు. వీరిలో ఒక  వీరాభిమానికి టికెట్స్ అందకపోవడంతో బ్లాక్ లో ఏకంగా రూ. 64000 ఖర్చు చేసి తన ముగ్గురు కూతుర్లతో మ్యాచ్ ఎంజాయ్ చేశాడు.తన పిల్లల స్కూల్ ఫీజు కట్టాల్సి ఉందని.. అందుకు తనవద్ద డబ్బులు లేవని.. కానీ ధోనిపై అభిమానంతో ఉన్న డబ్బులతో ఐపిఎల్ టికెట్స్ కొన్నట్లు ధోని వీరాభిమాని తెలిపాడు.

తనకు ధోని అంటే నాకు ఎంతో ఇష్టం. అతని ఆటను  ప్రత్యక్షంగా చూడాలనుకున్నా. అతడి ఆటను ఆస్వాదించాలని ఎప్పటినుండో కోరుకుంటున్నాను. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ  సారి ఎలాగైనా అతన్ని చూడాలనుకున్నా. అని సదరు అభిమాని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సొంతగడ్డపై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి కేకేఆర్ ను చిత్తు చేసింది. కేకేఆర్ విధించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కేకేఆర్ జట్టుకు ఈ టోర్నీలో ఇదే తొలి పరాజయం.