నిర్మాతగా మారిన ధోని.. మొదటి సినిమా లెట్స్ గెట్ మ్యారీడ్

నిర్మాతగా మారిన ధోని.. మొదటి సినిమా లెట్స్ గెట్ మ్యారీడ్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(Mahendrasingh Dhoni) నిర్మాతగా మారాడు. ఆయన సమర్పణలో ధోని సతీమణి సాక్షి ధోని(Sakshi dhoni) నిర్మిస్తున్న మూవీ "లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌". ఈ సినిమాలో నటుడు హరీష్‌ కల్యాణ్‌, నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమేష్‌ తమిళమణి(Ramesh thamilamani) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా మాట్లాడిన సాక్షి ధోని..  ముందుగా ప్లాన్ చేసుకున్న విడగానే షూటింగ్ జరుగుతోందని, మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా సినిమా ఉంటుందని, చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్‌జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ఇక త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్న ఈ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.