IPL 2023: మీ అభిమానానికి దండం రా సామీ..ధోని (వీడియో)

IPL 2023: మీ అభిమానానికి దండం రా సామీ..ధోని (వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని  ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. పొలం దున్నినా..లేక క్రికెట్ ప్రాక్టీస్ చేసినా..లేక కొత్త లుక్లో కనిపించినా..క్రికెట్ ఫ్యాన్స్కు విపరీతంగా నచ్చేస్తుంది. అయితే తాజాగా ధోని(Dhoni) చేసిన ఓ పని..సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

ధోని ధోని అంటూ అరుపులు..

మరో  రెండు రోజుల్లో ఐపీఎల్ 2023 (IPL2023) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్..ఎంఏ చిదరంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్ సెషన్‌ ను వీక్షించేందుకు మూడు స్టాండ్లలో అభిమానులకు అవకాశం ఇచ్చింది. దీంతో మూడు స్టాండ్లు అభిమానులతో నిండిపోయాయి. ఓ వైపు టీమ్ డగౌట్‌లో ధోనీ (Dhoni)బ్యాటింగ్‌కు సిద్దమవున్నాడు. ఈ సమయంలో  టీమ్ సభ్యులతో బ్యాటింగ్ టెక్నిక్స్ చర్చిస్తున్నాడు. అయితే అటు పక్కన స్టాండ్లలో ఉన్న ప్రేక్షకులు  ధోనీ.. ధోనీ అంటూ  నినాదాలు చేస్తున్నారు. 

దండంరా సామీ..

తనపై అభిమానంతో ధోని ధోని అంటూ నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్ను పలుకరించాడు.  వారివైపు తిరిగి చూస్తూ.. రెండు చేతులతో దండం పెట్టాడు. 'మీ అభిమానానికి ఓ దండంరా సామీ'అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.  ఈ వీడియోను ఓ ఫ్యాన్  సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..వైరల్ అయింది. 

https://twitter.com/TheDhoniEra/status/1640724759561515010

తొలి మ్యాచ్ ఎవరితో అంటే..

మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో ఆడబోతుంది.