మంజుల కూతురు వనితను పాతికేళ్ల క్రితం ‘దేవి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత ఎంఎస్ రాజు.. ఇప్పుడు వనిత కూతురును నటిగా పరిచయం చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘అగధ’ చిత్రంతో జోవికా విజయ్ కుమార్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ఆమె ‘హరిణి’ పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేస్తూ తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
జోరున కురుస్తోన్న వర్షంలో మసకబారిన పురాతన భవనం నేపథ్యంలో జోవికా చేతిలో కత్తి పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తోది. ఆమె పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఎంఎస్ రాజు అన్నారు. ఈ చిత్రంలో మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల, సింహా పాత్రలో ‘డర్టీ హరి’ ఫేమ్ శ్రవణ్ రెడ్డి కనిపించనున్నట్టు ఇప్పటికే వారి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్ వర్క్, దాదాపు 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్‌తో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ఎమ్మెస్ రాజు అన్నారు.
