ఎంటీఏఆర్​కి డిల్​​.. రెవెన్యూ పెరిగే ఛాన్స్​

ఎంటీఏఆర్​కి డిల్​​..  రెవెన్యూ పెరిగే ఛాన్స్​

హైదరాబాద్​, వెలుగు: ఎంటీఏఆర్ ​ టెక్నాలజీస్​ లిమిటెడ్​కి డిఫెన్స్​ ఇండస్ట్రియల్​ లైసెన్స్​ (డిల్​) వచ్చింది. డిఫెన్స్​ సెక్టార్​ కోసం మెకానికల్​, ఎలక్ట్రానిక్ సబ్​సిస్టమ్స్​ తయారు చేయడానికి ఈ లైసెన్స్​ వీలు కల్పిస్తుందని ఎంటీఏఆర్ టెక్నాలజీస్​ వెల్లడించింది. డిఫెన్స్​ ప్రాజెక్టుల కోసం  విదేశీ ఎంఎన్​సీలతో  కలిసి పనిచేయడానికీ అవకాశం ఇస్తుందని తెలిపింది. సీ41 ఎస్​ఆర్​ సిస్టమ్స్​ (కమాండ్​ కంట్రోల్​ కంప్యూటర్స్​, కమ్యూనికేషన్​ ఇంటెలిజెన్స్​ సర్వలెన్స్​ అండ్ రికానైజన్స్​ సిస్టమ్స్), ఎలక్ట్రానిక్స్​ ఎక్విప్​మెంట్​,

 ఇంటిగ్రేషన్​ అండ్​ అప్​గ్రెడేషన్​ ఆఫ్​ స్పెషల్​ నావల్​ ఎక్విప్​మెంట్​, ఎయిర్​ ఇండిపెండెంట్​ ప్రొపల్షన్​ సిస్టమ్స్​ వంటివి తయారు చేయగలుగుతామని పేర్కొంది. డిఫెన్స్​ ఇండస్ట్రియల్​ లైసెన్స్​ కారణంగా డిఫెన్స్​ నుంచి వచ్చే రెవెన్యూ పెరగడానికి ఛాన్స్​ ఉంటుందని, కొన్ని కాంప్లెక్స్​ సబ్​సిస్టమ్ ​లెవెల్​ ప్రాజెక్టులలో భాగం పంచుకోవడానికి కుదురుతుందని ఎంటీఏఆర్​ పేర్కొంది.