గేట్​తో ఎంటెక్:​ 2022 నోటిఫికేషన్​ రిలీజ్​

గేట్​తో ఎంటెక్:​  2022 నోటిఫికేషన్​ రిలీజ్​

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ), ఎన్​ఐటీల్లో ఎంటెక్​ కోర్సుల్లో అడ్మిషన్స్​కు గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​ (గేట్​) 2022 నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. ఈ సారి గేట్ ఎగ్జామ్​ను ఐఐటీ ఖరగ్‌‌పూర్ నిర్వహించనుంది. గేట్-2022లో కొత్తగా జీఈ (జియోమాటిక్స్ ఇంజనీరింగ్), ఎన్​ఎమ్​ (నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్) రెండు పేపర్లను ప్రవేశపెట్టారు. నౌకానిర్మాణ పరిశ్రమలు, జియో- ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు ఉండటంతో ఈ బ్రాంచుల్లో కూడా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈసారి కేవలం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే కాకుండా బీడీఎస్, ఎం.ఫార్మసీ అర్హత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
గేట్​ ర్యాంకుతో చదువు, జాబ్​
గేట్ స్కోరుతో ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. గేట్ స్కోరుతో బీహెచ్ఈఎల్, పవర్ గ్రిడ్, బెల్, డీఆర్డీఓ, గెయిల్, హాల్, ఇండియన్ ఆయిల్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. పై సంస్థలు కేవలం గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​ లిస్టు చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి.
అర్హత: గ్రాడ్యుయేషన్​ డిగ్రీ (ఇంజినీరింగ్​/ ఆర్కిటెక్చర్​/ సైన్స్​/ కామర్స్/ ఆర్ట్స్​ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్​ ఇయర్​ అభ్యర్థులూ అప్లై చేసుకోవచ్చు. 
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్​లైన్​ ఎగ్జామ్​
అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.1500
అప్లికేషన్స్​ ప్రారంభం: 30 ఆగస్టు
చివరితేది: 24 సెప్టెంబర్​
హాల్​టికెట్స్​ డౌన్​లోడ్​: 3 జనవరి 2022
ఎగ్జామ్​: 2022, ఫిబ్రవరి 5 నుంచి 13​ వరకు నిర్వహిస్తారు.
రిజల్ట్స్​: 17 మార్చి 2022
వెబ్​సైట్​: www.gate.iitkgp.ac.in