ఇంజనీరింగ్ అద్భుతం: రోడ్డు, మెట్రో ట్రాక్.. టూ ఇన్ వన్ ఫ్లైఓవర్..

ఇంజనీరింగ్ అద్భుతం: రోడ్డు, మెట్రో ట్రాక్.. టూ ఇన్ వన్ ఫ్లైఓవర్..

టెక్నాలజీ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసాధ్యాల్ని కూడా సుసాధ్యం చేసే స్థాయికి టెక్నాలజీ రీచ్ అవుతోంది. వైద్య రంగంలో అవయవ మార్పిడి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో AI వంటి అప్డేట్స్ తో ఎన్నో అద్భుతాలకు శ్రీకారం చుడుతున్నాడు మనిషి.నిర్మాణ రంగంలో కూడా టెక్నాలజీ అద్భుతాలను సృష్టిస్తోంది. బెంగళూరులో త్వరలోనే ప్రారంభం కానున్న మెట్రో ట్రాక్ ప్లస్ రోడ్డు కలిగిన టూ ఇన్ వన్ ఫ్లైఓవర్ ఇందుకు నిదర్శనం. మెట్రో ట్రాక్ తో పాటు టూవే రోడ్డు ఉన్న డబుల్ డెకర్ ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభం కానుంది.

బెంగళూరులోని రాగి గుడ్డ ఫ్లైఓవర్ నుండి సిల్క్ బోర్డు జంక్షన్ వరకు 3.3కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లైఓవర్ సౌత్ ఇండియాలోనే మొదటి డబుల్ డెకర్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వల్ల సౌత్ బెంగళూరు నుండి వైట్ ఫీల్డ్ లాంటి ఐటీ హబ్ లకు కనెక్టివిటీ పెరగనుంది. ఈ ఫ్లైఓవర్ పై 3 యూ టర్న్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:ఆ రూ.40 వేల మోదీ డబ్బులతో.. భర్తలను వదిలేసి ప్రేమికులతో పారిపోయిన మహిళలు