
ప్రగభల్ దర్శకుడు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ కృష్ణదాస్ నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ నెల 10న విడుదలవుతోంది. తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తు న్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ ‘చెన్నైలో ఈ సినిమా నాకు చూపించారు. దర్శకుడి ప్యాషన్, హార్డ్ వర్క్ కనిపించాయి. ఇలాంటి డిఫరెంట్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలని రిలీజ్ చేస్తున్నాను. థియేటర్‌లో చూడాల్సిన సినిమా’ అన్నారు. ‘ఐదేళ్ల జర్నీ ఈ సినిమా. డిఫరెంట్ ప్రెజెంటేషన్‌తో ఉండే అడ్వెంచరస్ మూవీ. ఇతర హీరోలతో అంత లాంగ్ జర్నీ కష్టమని మా బ్రదర్స్‌తో ఓన్ ప్రొడక్షన్‌లో తీశాం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రేక్షకులకు కొత్త ఫీల్ గ్యారంటీ’ అని దర్శకుడు చెప్పాడు.