ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో రోడ్డుపైకి వస్తే చాలు జనాలు చుక్కలు చూస్తున్నారు. చాలా చోట్ల రోడ్లు గోతులతో దర్శనమిస్తున్నాయి. అధ్వానంగాఉన్న పలు రహదారులపై ప్రయాణికుల ఒళ్లు గుల్లవుతోంది. ఖమ్మం నుంచి ముదిగొండ వెళ్లే రహదారిపై నిత్యం గ్రానైట్ లారీలకారణంగా గుంతలు పడ్డాయి. భారీ వాహనాలు, భారీ వర్షాలు, వరదల కారణంగా పలు చోట్ల ధ్వంసమైన,గుంతలకు గురైన రహదారుల మరమ్మతుల గురించి ఎవరూపట్టించుకోకపోవడంతో సమస్య జటిలమవుతోంది. మండలంలోప్రధానంగా చిరుమర్రి, సువర్ణాపురం, ముదిగొండ, న్యూ లక్ష్మీపురం, తదితర గ్రామాల్లో ఎన్ హెచ్ 365 హైవే హెవీ లోడ్ వెహికిల్స్లో అంతర్గత రోడ్లు దెబ్బతిని ధ్వంసమయ్యాయి.
కొన్ని సంవత్సరాలుగా రోడ్ పోయకుండా కాలయాపన చేస్తున్న ఎన్ హెచ్ 365 హైవే యాజమాన్యం సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని వారికి చీమ కుట్టినట్లు కూడా లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు ముగ్గురు మంత్రులు చొరవ తీసుకొని ధ్వంసమైన రోడ్లను మరమ్మత్తులు చేయించాలని వాహనదారులు, ప్రయాణికులు, మండల వాసులు కోరుతున్నారు.