పంజాగుట్ట, వెలుగు: ముదిరాజ్ కులస్థులను బీసీ-ఏ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి సతీశ్ ముదిరాజ్ కోరారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఆయన ప్రతిపక్ష నేత కేటీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ముదిరాజ్‌లకు బీసీ-ఏ హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేటీఆర్ ఈ అంశంపై వాయిదా తీర్మానం కోరాలని, తద్వారా ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకునేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ విషయంలో సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ముదిరాజ్‌లకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
