మా ఆందోళనలో పాల్గొనండి జైశంకర్​కు పాక్ పార్టీ పిలుపు

మా ఆందోళనలో పాల్గొనండి జైశంకర్​కు పాక్ పార్టీ పిలుపు

ఇస్లామాబాద్: పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలపనున్న నిరసనలో పాల్గొనాల్సిందిగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ను పాకిస్తాన్– తెహ్రీక్–ఇన్సాఫ్(పీటీఐ) నేత మహమ్మద్ అలీ సైఫ్ ఆహ్వానించారు. ఇస్లామాబాద్లో జరగనున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాక్ లో అక్టోబర్15, 16 తేదీల్లో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ మీటింగ్ కు విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరు కానుండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జియో న్యూస్ తో సైఫ్ మాట్లాడారు.

‘‘పాక్​లో బలమైన ప్రజాస్వామ్యం ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది. పీటీఐ ఇస్లామాబాద్​లో ఆందోళన చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మా ప్రజలతో మాట్లాడాలని జై శంకర్​ను ఆహ్వానిస్తున్నాం” అని తెలిపారు. ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసేలా ఒత్తిడి తేవాలని పీటీఐ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతోంది. తమ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్​ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.