రిలయన్స్ వారసులను ప్రకటించిన ముఖేష్ అంబానీ

రిలయన్స్ వారసులను ప్రకటించిన ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వారసత్వం విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. ముఖేష్ ఇవాళ జరిగిన ఏజీఎం మీటింగ్లో కీలక నిర్ణయం వెల్లడించారు. రిలయన్స్ ఫ్యూచర్ లీడర్స్ గా తన మగ్గురు వారసులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆకాష్ అంబానీని ఇప్పటికే జీయో ఇన్ఫోకామ్ చైర్మన్ గా ప్రకటించిన ముఖేష్.. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వ్యాపారం, అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారాన్ని చూసుకుంటారని చెప్పారు.

నిబద్ధతతో పనిచేస్తున్నాం : ఇషా అంబానీ

దేశం సంస్కృతి, వారసత్వం పట్ల నిబద్ధతతో ఉన్నట్లు ఇషా అంబానీ తెలిపారు. గిరిజనులు సహా అణగారిన వర్గాలు తయారుచేసిన వస్తువులను త్వరలోనే మార్కెటింగ్ చేస్తామని ప్రకటించారు. భారతీయ చేతివృత్తులు, ముఖ్యంగా మహిళల ప్రతిభ, నైపుణ్యాభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. మొత్తం 260 పట్టణాల్లో  జియోమార్ట్ సేవలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రోజుకు 6 లక్షల డెలివరీలు చేస్తున్నట్లు చెప్పారు. రిలియన్స్ రిటైల్ ఈ ఏడాది 1500 స్టోర్లను ప్రారంభించింది. వీటితో కలిపి దాన్ని స్టోర్ల సంఖ్య 15వేలు దాటింది. 

రిలియన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చేపట్టనున్న అనంత్

అనంత్ అంబానీ రిలయన్స్ ఎనర్జీ బాధ్యతలు చూసుకోనున్నారు. గ్రీన్ ఎనర్జీని పెంపొందించాలన్న ప్రధాని మోడీ ఆశయంలో రిలియన్స్ అగ్రగామిగా నిలిచేందుకు పోటీ పడుతోంది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో భాగంగా సోలార్ సహా గ్రీన్ హైడ్రోజన్ లలో సేవలు విస్తరించేందుకు రిలయన్స్ ప్రణాళికలు రచిస్తోంది.