అంబానీ ఫేక్ వీడియో నమ్మి.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్

అంబానీ ఫేక్ వీడియో నమ్మి.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్

AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ వీడియోను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు.. స్టా్క్ మార్కెట్ లో పెట్టుబడికి ముకేష్ అంబానీ సూచనలు, సలహాలు అంటూ డీప్ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు కేటుగాళ్లు.. ఆ వీడియో నిజం అనుకుని.. ముంబైకి చెందిన ఓ డాక్టర్.. 7 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు.. తీరా చూస్తే అంతా ఫ్రాడ్ అని తేలింది.. ఈ ఇష్యూలోని పూర్తి వివరాల్లోకి వెళితే...

ముంబైలోని అంధేరీకి చెందిన 54 ఏళ్ల డా. KH పాటిల్ సైబర్ స్కాంకు గురయ్యింది. డాక్టర్ పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో డీప్‌ఫేక్ వీడియోను చూశారు. ముకేశ్ అంబానీ తమ BCF అకాడమీ ద్వారా అధిక రాబడిని వస్తుందని చెప్తూ, రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్‌ను ఆమోదించినట్లు వీడియోలో చూశారు. దీంతో అంబానీ చెప్పాక ఆగుతామా అనుకున్న డాక్టర్ ఆన్‌లైన్ సెర్చ్ చేశారు. 

లండన్‌లో, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయాని నెట్ లో చూసింది. ఇంత రిచ్ ప్లేస్ లో ఆఫీస్ ఉన్నాక పెట్టుబడి ఎందుకు పెట్డకూడదనుకున్న డాక్టర్.. మే, జూన్ నెలలో రూ. 7.1 లక్షలు పెట్టుబడులు పెట్టింది. రూ. 30 లక్షలు లాభం వచ్చినట్టు యాప్ లో చూపించగా ఖుషీ అయ్యింది డా. పాటిల్. ఇంకేముంది నగదు విత్ డ్రా చేద్దామని అనుకుంది. ఈ క్రమంలోనే పెద్ద షాక్ తగిలింది. 

ఎన్నిసార్లు నొక్కినా చేతి వేలు నొప్పి లేస్తుందే కానీ డబ్బులు విత్ డ్రా కావడం లేదు. దీంతో తను మోసపోయానని అర్థం చేసుకున్న డా. పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబానీ యొక్క డీప్‌ఫేక్ వీడియోలతో కూడిన సంఘటనలు గతంలో ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఎవరూ ఇలాంటివి నమ్మకోడదని సూచించారు. 

ఈ విషయం కాస్త ఎక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అంబానీ పెట్టుబడులు పెట్టమని ఎందుకు వీడియో చేస్తారు.. కొంచమైనా ఆలోచించాలి కదా.. ఇకనైనా జాగ్రత్త పడండి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.