రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే పెట్రోల్, ఎలక్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ ఇలా అన్నింట్లోనూ విస్తరించిన రిలయన్స్ ఇపుడు ఐస్ క్రీం రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్దమయ్యింది. ఇదే జరిగితే కొందరు ఆఫర్ల పేరుతో తమ ఉత్పత్తుల ధరలను తక్కువగా అయినా మార్కెట్ లో విక్రయించేందుకు సాహసం చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐస్ క్రీమ్ లను తన ప్రాడెక్ట్ ల జాబితాలోకి చేర్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుసుంది. ఇప్పటికే ఈ సంస్థ 20వేల కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమను గుజరాత్ లో నెలకోల్పేందుకు సిద్దం అయినట్లు సమాచారం. గతంలో ప్రముఖ ఐస్ క్రీమ్ తయారు చేసే సంస్థలైన ఐస్ క్రీం, స్టార్మీ ఇండస్ట్రీస్, అమూల్ వంటి దిగ్గజ కంపెనీలతో కలిసి ముందుకు వెళ్లేందుకు చర్చలు జరిపింది. అలాగే ఇప్పుడు చిన్న చిన్న ఔట్ సోర్సింగ్ ఐస్ తయారీ పరిశ్రమలతో ఉత్పత్తి ప్రారంభించి పెద్దగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించింది.
అన్ని సవ్యంగా జరిగితే ఈ వేసవిలోనే కంపెనీ తన సొంత ఐస్‌క్రీమ్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రిలయన్స్ ప్రవేశంతో ఐస్ క్రీం మార్కెట్‌లో తీవ్రమైన మార్పులను తీసుకువచ్చే అవకాశాలున్నాయి.
