లంక టెలికం కంపెనీలో జియోకు వాటా?

లంక టెలికం కంపెనీలో జియోకు వాటా?

న్యూఢిల్లీ: జియో ప్లాట్‌‌ఫారమ్స్​ శ్రీలంక యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ లంక టెలికాం పీఎల్​సీ లో  సర్కారు వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. మొత్తం మూడు సంస్థలు ఈ వాటాను కొనడానికి ఆసక్తి చూపించాయి. జాతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌‌లో తన వాటాను ఉపసంహరించుకోవాలని లంక నిర్ణయించుకుంది. వాటా కొనుగోలు కోసం పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. అప్లికేషన్లకు దాఖలు గడువు జనవరి 12తో ముగిసిన తర్వాత, గార్ట్యూన్​ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌‌మెంట్, పెట్టిగో కమర్షియో ఇంటర్నేషనల్,  జియోలను బిడ్డర్లుగా   లంక ప్రభుత్వం గుర్తించింది.