ముంబై దగ్గర మెగాసిటీ.. ముకేష్ అంబానీ ప్లాన్

ముంబై దగ్గర మెగాసిటీ.. ముకేష్ అంబానీ ప్లాన్

టెలికాంలో సంచలనాల మీద సంచలనాలు సృష్టించి… దిగ్గజాలకే షాకిచ్చిన రిలయన్స్అధినేత ముకేశ్ అంబానీ కన్ను ఇప్పుడు రియాల్టీపై పడింది. అర్బన్ ఇన్‌‌‌‌ఫ్రా గేమ్‌ ఛేంజర్‌ గా, ఇండియన్సిటీల రూపురేఖలను మార్చేందుకు ముకేశ్ వస్తున్నారు. ముంబై సమీపంలో ఒక మెగాసిటీని ఏర్పాటు చేసేందుకు బ్లూ ప్రింట్‌ ను సిద్ధం చేసినట్టు ఒక ఇంగ్లీష్పేపర్​ వెల్లడించింది. ‘ప్రాజెక్స్ట్ వితిన్ ప్రాజెక్’ట్ అనే కార్యక్రమంలో రిలయన్స్ గ్రూప్ చేపట్టబోయే అతిపెద్దప్రాజెక్ట్ ఇదేనని పేర్కొంది. సింగపూర్ తరహాలోఅంబానీ మెగాసిటీని అభివృద్ధి చేయబోతున్నారు.ఈ మెగాసిటీలోనే విమానయానం, నౌకాయానం, సముద్రయాన కనెక్టివిటీ ఉండనుంది. ఒక్కసారి ఈసిటీ కట్టడం పూర్తి అయిన తర్వాత, 5 లక్షల మందికి నివాసయోగ్యం తో పాటు, వేలమందికి వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. వచ్చే దశాబ్దం లో ఈ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారు. రిలయన్స్ ఈ కొత్త ప్రాజెక్ట్‌‌‌‌ ఇండియాకు కొత్త అధ్యాయం కాబోతోందని, పూర్తిగా అర్బన్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రారూపురేఖలనే మార్చేయబోతుందని నిపుణులంటున్నారు. ఈ మెగాసిటీ వచ్చాక, ముంబై సమూలంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ముంబైతో పోలిస్తే, ఈ కొత్త నగరంలోనే ప్రాపర్టీ ధరలు చవుకగా ఉండనున్నాయని, దీంతో వలసలు పెరిగే అవకాశం ఉందని కూడా టాప్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌‌‌‌లు పేర్కొంటున్నారు.అఫర్డబులిటీ, క్వాలిటీలో అంబానీ మెగాసిటీ, జియోమాదిరిగా ఉండనుందని నిపుణులంటున్నారు.

ప్రాజెక్ట్ చరిత్ర…
రిలయన్స్ గ్రూప్ లెజెండరీ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీదే ఈ ప్రాజెక్ట్ ఐడియా అట. నేవీ ముంబైలో ఒక వరల్డ్ క్లాస్‌‌‌‌ సిటీని ఏర్పాటు చేయాలనుకునే వారట. రోడ్డుమార్గం ద్వారా దక్షిణ ముంబై, నేవి ముంబైతోఈ ప్రాజెక్ట్ లింక్‌‌‌‌ ఉండాలని ధీరూభాయ్ భావించారు. గ్లోబల్ తరహాలో ఎకనామిక్ హబ్ అభివృద్ధి కోసం తొలి పేమెంట్‌ గారూ. 2,180 కోట్లను చెల్లించి నేవీ ముంబైసెజ్‌ నుంచి 4వేల ఎకరాల భూమిని లీజుకుతీసుకున్నట్టు రిలయన్స్ గత నెలలోనే ప్రకటించింది. వరల్డ్ క్లాస్ సెజ్‌ ను అభివృద్ధి చేయడానికి ఈ భూమిని 2006లోనే నేవిముంబై సెజ్ ఇచ్చింది. నేవి ముంబై సెజ్‌ ను ముకేశ్ అంబానీ, జై కార్ప్‌‌‌‌ ఇండియా, ఎస్‌‌‌‌కేఐఎల్ ఇన్‌‌‌‌ఫ్రా స్ట్రక్చర్​ లిమిటెడ్, సిటీ అండ్ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్‌‌‌‌లు ప్రమోట్ చేస్తున్నాయి. నేవి ముంబై సెజ్‌ లోసిటీ అండ్ ఇండస్ట్రీయల్ డెవలప్‌‌‌‌మెంట్‌ కు26 శాతం వాటా ఉంది. మిగతాది ఇతరులదగ్గర ఉంది.