భారత్కు క్లీన్ ఎనర్జీ, బయో ఎనర్జీ, డిజిటల్ విప్లవం అవసరం:ముకేశ్ అంబానీ

భారత్కు క్లీన్ ఎనర్జీ, బయో ఎనర్జీ, డిజిటల్ విప్లవం అవసరం:ముకేశ్ అంబానీ

భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణ స్థాయిలో వృద్ధి సాధిస్తోందని రిలయన్స్  అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లు ఉన్న ఇండియన్ ఎకానమీ..2047 వరకు 40 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు భారతదేశం వరల్డ్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో టాప్ 3లో ఉంటుందని చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్లో పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 10వ  గ్రాడ్యుయేషన్ సెర్మనీలో వర్చువల్గా పాల్గొన్నారు. తమ చదువును పూర్తి చేసుకున్న విద్యార్థులు... దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. 

ఆర్ధిక వృద్ధికి అవే కారణమవుతాయి..

భారత్కు క్లీన్ ఎనర్జీ, బయో-ఎనర్జీ, డిజిటల్ విప్లవం అవసరమని ముకేశ్ అంబానీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్లీన్ ఎనర్జీ, బయో ఎనర్జీ, డిజిటల్ విప్లవం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. అవి దేశ ప్రజల జీవితాలనే మార్చేస్తాయని జోస్యం చెప్పారు. దేశంతో పాటు..ప్రపంచ వాతావరణ సంక్షోభం నుంచి ఇవే కాపాడతాయని తెలిపారు.