కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి : కుక్కల నరేశ్ గౌడ్

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి :  కుక్కల నరేశ్ గౌడ్
  • పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేశ్ గౌడ్ 

ములుగు, వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేశ్ గౌడ్ అన్నారు. ఆదివారం ములుగు, క్షీరాసాగర్, తునికిబొల్లారం, నర్సాపూర్, సింగన్నగూడ, కొట్యాల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో  ఏఎంసీ చైర్​పర్సన్​విజయ మోహన్,  వైస్ చైర్మన్ ప్రభాకర్, పీఏసీఎస్​డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాములు గౌడ్, కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాల్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు శ్రీను, వజీర్, మహేందర్, మల్లేశ్, నర్సింహ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.