బదిలీ అయిన గన్ మెన్లకు ఘనంగా వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే

బదిలీ అయిన గన్ మెన్లకు ఘనంగా వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే
  • తన గన్ మెన్లు బదిలీపై వెళ్తున్న సందర్భంగా భావోద్వేగానికి లోనైన ములుగు ఎమ్మెల్యే సీతక్క

వరంగల్: తన గన్ మెన్లు బదిలీపై వెళ్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. తనను కంటికి రెప్పలా.. సొంత సోదరిలా చూసుకున్నారంటూ కంటతడిపెట్టుకున్నారు. నిద్రపోయే సమయంలో తప్ప నిరంతరం నన్ను నీడలా వెంట ఉండి జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా.. సమాజంలో నా గౌరవాన్ని పెంచే విధంగా ప్రవర్తించారని ప్రశంసించారు. కంటికి రెప్పలా సొంత సోదరిలా చూసుకున్న గన్ మెన్లు ఉద్యోగ నిర్వహణలో భాగంగా బదిలీ కావడం చాలా బాధగా ఉందన్నారు. ఇన్నేళ్ళ కాలంలో వారితో కుటుంబం బాంధవ్యం ఏర్పడిందన్నారు. యుద్ధ రాజకీయం నుంచి వచ్చిన నా పట్ల వారు గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరించారని అభినందిస్తూ వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

 

ఇవి కూడా చదవండి:

సల్మాన్ ఖాన్ ను కాటేసిన పాము

మరో హిందీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమంత గ్రీన్‌ సిగ్నల్

రివ్యూ : శ్యామ్ సింగరాయ్