ఈడీ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్

V6 Velugu Posted on Sep 15, 2021

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది.  సినీనటి ముమైత్ ఖాన్ ఈడీ విచారణకు హాజరయ్యారు.  ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముమైత్....అక్కడి నుండి ఈడీ ఆఫీస్ కు వచ్చారు. ముమైత్ ఖాన్ నుంచి కెల్విన్ కు పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. కెల్విన్ తో ముమైత్ జరిపిన లావాదేవీలపై ఆరా తీయనున్నారు. 2015 సంవత్సరం నుంచి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ డాక్యుమెంట్స్ తో విచారణకు రావాలని ఆదేశించారు. కెల్విన్ నుండి భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. 2017 సంవత్సరంలోనూ ముమైత్ కాన్ ను 6 గంటల పాటు విచారించారు ఎక్సైజ్ అధికారులు.  ముమైత్ ఖాన్ కెల్విన్ ని కలిపి విచారించే అవకాశముంది. ముమైత్ ఖాన్ బ్యాంక్ లావాదేవీలు, విదేశీ డ్రగ్స్ పెడలర్ తో జరిపిన ట్రాన్సక్షన్ పై ఆరా తీయనున్నారు.

Tagged ED, drug case, , Mumaith Khan

Latest Videos

Subscribe Now

More News