ముంబై 24/7 ఓపెన్ .. అంతంతే

ముంబై 24/7 ఓపెన్ .. అంతంతే

పగలు.. రాత్రుళ్లు అన్న తేడా లేకుండా 24 గంటలూ షాపులు, మాళ్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసి పెట్టేలా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జనవరి 26 అర్ధరాత్రి నుంచి అమలవుతోంది. మరి, దానిపై రెస్పాన్స్​ ఏంటి? ఫస్ట్​ రోజు బిజినెస్ లు ఎలా
నడిచాయి?.. అంటే అంతంతమాత్రమేనట. దానికీ కారణాలున్నాయి. ఒకటి సేఫ్టీ, రెండు జనాలు రాకపోవడం, అసలైంది.. షాపులోళ్లే ఇంట్రెస్ట్​ చూపించకపోవడం. అవును, మహారాష్ట్ర సర్కారు నిర్ణయాన్ని చాలా మంది ముంబైకర్లు స్వాగతించినా, మహిళల భద్రత మాటేం టన్న ప్రశ్నలు వేస్తున్నారు. కస్టమర్లు రానప్పుడు షాపు తెరిచి ఉంచి లాభమేంటని షాపులోళ్లూ అడుగుతున్నారు. ‘‘జనం నుంచి మంచి స్పందన వస్తేనే నేను షాపు ఓపెన్ చేయగలను. జనం రానప్పుడు షాపు ఓపెన్ చేసి మాత్రం ఏం లాభం? నేను ఓ వ్యాపారిని. నా ఆదాయం, ఖర్చులనూ లెక్క చూసుకోవాలి కదా’’ అని ఆట్రియా మాల్ లోని గేమ్
స్టాప్​ అనే షాప్​ ఓనర్ జావెద్ చెప్పారు.

‘‘మాల్ లోని బ్రాండ్స్​ ఇంకా దానికి సిద్ధం కాలేదు. కానీ, వీకెం డ్స్​లో మాత్రం 24 గంటలూ ఓపెన్ చేస్తున్నాం. అప్పుడు
జనం ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడూ అదే జరుగుతుంది’’ అని ఆట్రియా మాల్ మేనేజర్ జయేశ్ కేత్కర్ చెప్పారు. సేఫ్టీకి సంబంధించి మహారాష్ట్ర సర్కారు చర్యలూ తీసుకునేందుకు రెడీ అవుతోంది. టైం దాటిన తర్వాత మందు అమ్మకుండా కూడా
చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ ఆ రూల్ ను మీరితే లిక్కర్ లైసెన్స్​ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించింది. అయితే, దాన్ని పర్యవేక్షించేందుకు కనీసం 7 వేల మంది పోలీసులు అవసరమవుతారని అధికారులు చెబుతున్నారు. మరో వైపు భద్రతకు సంబంధించి క్యాబ్ ఆపరేటర్లు, యూనియన్లు సహకరించాల్సిందిగా ముంబై డీసీపీ అవినాష్ కుమార్ కోరారు.

 కివీస్ కు చుక్కలు చూపించిన భారత్