Ranji Trophy 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ.. సెమీస్‌లో మధ్య ప్రదేశ్ చిత్తు

Ranji Trophy 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ.. సెమీస్‌లో మధ్య ప్రదేశ్ చిత్తు

రంజీ ట్రోఫీ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంది. తుది పోరులో తలపడే జట్లేవో తెలిసిపోయాయి. తొలి సెమీస్ లో తమిళ నాడు తో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగులు తేడాతో గెలిచింది. ఇక నిన్న (మార్చి 5) ముగిసిన మరో సెమీ ఫైనల్లో మధ్య ప్రదేశ్ ను విదర్భ చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మార్చి 10న జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో 48 సార్లు టైటిల్ విజేత ముంబైతో విదర్భతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఉదయం 9:30 కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 

321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 258 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో వికెట్ నష్టానికి 128 పరుగులతో పటిష్టంగా కనిపించిన మధ్య ప్రదేశ్ అనూహ్యంగా కుప్పకూలింది. యాష్ దూబే(94), గౌలి(67) రెండో వికెట్ కు 106 పరుగుల జోడించి లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. అయితే 130 పరుగుల వ్యవధిలో మిగిలిన 9 వికెట్లను కోల్పోయి ఊహించని ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ ఆవేశ్ ఖాన్ ధాటికి 170 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ హుష్మణ్త్ మంత్రి సెంచరీతో 252 పరుగులకు ఆలౌటై 82 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో యాష్ దూబే (141) వీరోచిత సెంచరీతో 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. 321 పరుగుల లక్ష్య ఛేదనలో 258 పరుగులకే పరిమితమై సెమీస్ లోనే నిష్క్రమించింది.