జోర్దార్‌‌‌‌‌‌‌‌ జోసెఫ్‌.. సన్ రైజర్స్ పై ముంబై విక్టరీ

జోర్దార్‌‌‌‌‌‌‌‌ జోసెఫ్‌.. సన్ రైజర్స్ పై ముంబై విక్టరీ

లీగ్‌ ఏదైనా.. టీమ్‌ మరేదైనా.. ప్రత్యర్థి ఎవరైనా..విండీస్‌ వీరుల విధ్వంసానికి హద్దే లేకుండా పోతోంది. ఈ సీజన్‌ స్టారింగ్‌ నుంచి రసెల్‌ మిసైల్‌ లాపేలుతుంటే.. మేమేం తక్కువా అన్నట్లు కరీబియన్‌ ఆల్‌ రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ తన బ్యాట్‌ పవర్‌ చూపిస్తే.. ఆడిన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ లోనే 6 వికెట్లు పడగొట్టిన అల్జారీ జోసెఫ్‌ ఇన్‌ స్టాంట్‌ హీరో అయ్యాడు. దీంతో శనివారం రాత్రి స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ 40 పరుగుల తేడాతో సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌ పైగ్రాండ్‌ విక్టరీ కొట్టింది. మందకొడి పిచ్‌ పై మొదటబ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 136 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. టాపార్డర్‌ విఫలమైనా ఆఖర్లోపొలార్డ్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46నాటౌట్‌ ) దుమ్ము రేపడంతో పోరాడే స్కోరు చేసింది. రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ కౌల్‌ కు 2 వికెట్లు దక్కాయి.అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం మహ్మద్‌ నబీ (1/13), రషీద్‌ఖాన్‌ (1/27) ఎక్కువ వికెట్లు తీయకపోయినా పరుగులివ్వకుండా కట్టడిచేశారు. అనంతరం ఛేజింగ్‌ లోజోసెఫ్‌ (6/12) ధాటికి బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలం అవడంతో హైదరాబాద్‌ 17.4 ఓవర్లలో 96 పరుగులకే పరిమితమై సొంత గడ్డపై ఈ సీజన్‌ లో తొలిఓటమి మూటగట్టుకుంది. దీపక్‌ హుడా (20) టాప్‌స్కోరర్‌. జోసెఫ్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుదక్కింది.

ఒకరి వెంట మరొకరు..

లీగ్‌ లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న పేసర్‌ జోసెఫ్‌ ధాటికిహైదరాబాద్‌ చివురుటాకులా వణికింది. లీగ్​లోవేసిన తొలి బంతికే జోసెఫ్‌ .. వార్నర్‌ (15)ను ఔట్‌చేశాడు. గత నాలుగు మ్యాచ్‌ ల్లోనూ అదరగొట్టిన రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌ జోడీ ఈ సారి విఫలమైంది. 3ఫోర్లు కొట్టి మంచి టచ్‌ లో కనిపించిన బెయిర్‌ స్టో(16).. చహర్‌ బౌలింగ్ భారీ షాట్‌ కు యత్నించి బుమ్రాకు చిక్కాడు. దీంతో హైదరాబాద్‌ 33 రన్స్‌‌‌‌‌‌‌‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. జోసెఫ్‌ వేసిన మరుసటి ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగాడు. తొలి బంతికే పెద్ద చేపను ఖాతాలో వేసుకున్న జోసెఫ్‌ ఆ తర్వాత మరింతగా చెలరేగాడు. దీంతో.. ఏ దశలోనూ సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ పోటీలో నిలవలేకపోయింది. పవర్‌ ప్లే ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. మరుసటి ఓవర్‌ లో శంకర్‌(5) కూడా ఔటయ్యాడు. ఇక అక్కడ నుంచి రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ నత్తనడకను తలపించింది. పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ పాండే (16).. రోహిత్‌ పట్టినచురుకైన క్యాచ్‌ కు డగౌట్‌ చేరితే.. యూసుఫ్‌ పఠాన్‌(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. ఈదశలో 5 ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాలేదు.దీపక్‌ హుడా, మహ్మద్‌ నబీ (11) కాసేపు పోరాడినా..సాధించాల్సిన రన్‌ రేట్‌ పెరిగిపోతుండటంతో..ఒత్తిడికి లోనై వికెట్‌ సమర్పించుకున్నారు. జోసెఫ్‌ బౌలింగ్‌ లో హుడా, రషీద్‌ ఖాన్‌ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఆ మరుసటి ఓవర్‌ లో నబీ (11) కూడావెనుదిరగడంతో సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఆశలు ఆవిరయ్యాయి.18వ ఓవర్‌ లో భువనేశ్వర్‌ (2), కౌల్‌ (0)ను ఔట్‌చేసిన జోసెఫ్‌ ఐపీఎల్​లో బెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌ గణాంకాలునమోదు చేసుకున్నాడు.స్టార్టింగ్‌ ట్రబులే..అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగినముంబైకి ఆరంభంలోనే షాక్‌ తగిలిం ది. కెప్టెన్‌రో హిత్‌ (11).. నబీ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌ లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌ కే కౌల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన హిట్‌ మ్యాన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరికాసేపటికే సందీప్‌ బౌలింగ్‌ లోసూర్యకుమార్‌ (7) వికెట్ల ముందు దొరికిపోయాడు.దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబై 2 వికెట్లుకోల్ పోయి 30 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు ఫుల్‌రైజింగ్‌ లో ఉండటంతో ముంబై వరుస విరామాల్లోవికెట్లు కోల్పోతూ వచ్చింది. డికాక్‌ (19), క్రునాల్‌(6)ను కౌల్‌ బోల్తా కొట్టిస్తే.. ఇషాన్‌ కిషన్‌ (17)రనౌట్‌ గా వెనుదిరిగాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై 67/5తో నిలిచిం ది. హార్డ్‌ హిట్టర్లుహార్దిక్‌ పాండ్యా (14), పోలార్డ్‌ క్రీజులో ఉన్నావరుసగా 3 ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాలేదంటే రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు ఎంత పకడ్బందీగా బౌలింగ్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. 17వ ఓవర్లోఓ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన హార్దిక్‌ .. డీప్‌ మిడ్‌ వికెట్‌ లో శంకర్‌ కుక్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత పొలార్డ్​ ఇన్నింగ్స్​కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

స్కోర్ బోర్డ్:
రోహిత్ (సి) హుడా (బి) నబీ 11, డికాక్ (సి) హుడా (బి) కౌల్ 19, సూర్యకుమార్ (ఎల్బీ ) సందీప్7, ఇషాన్ కిషన్ (రనౌట్ ) 17, క్రునాల్ (సి) బెయిర్ స్టో (బి) కౌల్ 6, పొలార్డ్ (నాటౌట్ ) 46, హార్దిక్ (సి)శంకర్ (బి) రషీద్ 14, చహర్ (సి) బెయిర్ స్టో (బి) భువనేశ్వర్ 10, జోసెఫ్ (నాటౌట్ ) 0; ఎక్స్ ట్రాలు: 6;మొత్తం: 20 ఓవర్లలో 136/7; వికెట్ల పతనం: 1–21, 2–28, 3–43, 4–63, 5–65, 6–86, 7–97; బౌలింగ్ :భువనేశ్వర్ 4–0–34–1, సందీప్ 3–0–20–1, నబీ 4–0–13–1, పఠాన్ 1–0–8–0, కౌల్ 4–0–34–2,రషీద్ 4–0–27–1.

హైదరాబాద్:
వార్నర్ (బి) జోసెఫ్ 15, బెయిర్ స్టో (సి) బుమ్రా (బి) చహర్ 16, శంకర్ (సి) హార్దిక్ (బి) జోసెఫ్5, పాం డే (సి) రోహిత్ (బి) బెరెన్ డార్ఫ్ 16, హుడా (బి) జోసెఫ్ 20, పఠాన్ (సి) ఇషాన్ (బి) చహర్ 0, నబీ (సి)రోహిత్ (బి) బుమ్రా 11, రషీద్ (సి అండ్ బి) జోసెఫ్ 0 , భువనేశ్వర్ (బి)జోసెఫ్ 2, కౌల్ (సి) డికాక్ (బి)జోసెఫ్0, సందీప్ (నాటౌట్ ) 5: ఎక్స్ ట్రాలు: 6; మొత్తం: 17.4 ఓవర్లలో 96 ఆలౌట్ ; వికెట్ల పతనం: 1–33, 2–33,3–42, 4–61, 5–62, 6–88, 7–88,8–90, 9–91,10–96 ; బౌలింగ్ : బెరెన్ డార్ఫ్ 4–0–28–1, బుమ్రా3–0–16–1 , చహర్ 4–0–21–2, జోసెఫ్ 3.4–1–12–6 , క్రునాల్ 2–0–9–0, హార్దిక్ 1–0–7–0 .