అర్రెర్రె.. ఏం ఐడియాలు రా : వడాపావ్ మధ్యలో జంతికలు పెట్టారు..

అర్రెర్రె.. ఏం ఐడియాలు రా : వడాపావ్ మధ్యలో జంతికలు పెట్టారు..

ఈ వర్షాకాలంలో ఎవరికైనా వేడి వేడిగా ఏదైనా తినాలనిపించడం కామన్. అలా మీరు కూడా ఈ సీజన్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నారా..? అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న 'చీజ్ చక్లి పావ్'ని మీరూ ప్రయత్నించి చూడండి. అసలు అది చేయాలో తెలియదు.. ఎలా ప్రయత్నించాలి అనుకుంటున్నారా.. అది కూడా ఈ వీడియోలోనే ఉంది. ఓసారి లుక్కేయండి.

ముంబయిలో సాధారణంగా ఇప్పటివరకు ఫేమస్ అయిన వడాపావ్, గోల్ గప్ప లాంటి చిరుతిళ్ల పేర్లు మాత్రమే విని ఉంటాం. ఇప్పుడు మాత్రం ఈ 'చీజ్ చక్లి పావ్' వైరల్ అవుతోంది. దీన్ని తయారు చేసే ఏకైక రెస్టారెంట్ 'శ్రీ కాశీ ఫుడ్స్' అని.. ఇది ములుండ్ వెస్ట్‌లో ఉన్నట్టుగా వీడియోలో చూపించారు.

వైరల్ అవుతోన్న ఈ వీడియోలో బన్ ను కట్ చేసి.. మధ్యలో జంతిక, చట్నీ, చీజ్ తో ఫిల్ చేసి, దాన్ని ఓవెన్ లో కాసేపు పెట్టారు. ఆ తర్వాత తినేందుకు రెడీగా ఉన్న ఈ రెసిపీని సర్వ్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ రెసిపీ వీడియో... వీక్షకుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. దీనికి ఇప్పటివరకు 22వేలకు పైగా లైక్‌లను గెలుచుకోగా... కొందరు ఫైర్ ఎమోజీలతో డిష్‌ను ప్రయత్నించడానికి తమ ఆత్రుతను వ్యక్తం చేశారు.

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naman Parmar (@lets.eattogether)